అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన భట్టి విక్రమార్క
* మండల కేంద్రంలోని ఎన్.టి.ఆర్ కాలనీ ప్రజలు తమకు మౌలిక సదుపాయాలు కల్పించాలని రోడ్డుపై బైఠాయింపు..
* ఉపముఖ్యమంత్రి కారును అడ్డగింత..
ఎర్రుపాలెం అక్టోబర్ 4 (విజయక్రాంతి): మండలంలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టనున్న 12.89 కోట్ల అభివృద్ధి పనులకు ఆదివారం నాడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka), జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకరతో కలిసి శంకుస్థాపనలు చేశారు. మొత్తం రూ.12.89 కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులను శ్రీకారం చుట్టునున్నారు.
ఎర్రుపాలెం నుంచి జయంతి వరకు బీటీ రహదారి నిర్మాణం — రూ.5.35 కోట్లు.
ఎస్సీ కాలనీలో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం — రూ.55 లక్షలు.
రామాపురం నుంచి కొత్తపాలెం వరకు బీటీ రహదారి నిర్మాణం — రూ.6.15 కోట్లు.
రామాపురం ఎస్సీ కాలనీలో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం — రూ.13 లక్షలు.
రెమిడిచర్ల ఎస్సీ కాలనీలో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం — రూ.71 లక్షలు నిధులతో నిర్మించనున్నారు.
* ఎన్టీఆర్ కాలనీ ప్రజలు తమకు మౌలిక సదుపాయాలు కల్పించాలని రోడ్డుపై బైటాయింపు...
మండల కేంద్రంలోని ఎర్రుపాలెం నుండి జయంతి వరకు నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం తిరిగి రేమిడిచర్ల రామపురం గ్రామాల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడానికి వెళుతుండగా మండల కేంద్రంలోని ఎన్టీఆర్ కాలనీ ప్రజలు మధిర విజయవాడ ప్రధాన రోడ్డుపై బైఠాయించి బట్టి విక్రమార్క కారును అడ్డుకున్నారు.
స్థానిక కాంగ్రెస్ నాయకులు ముందుగా కాలనీ ప్రజలకు చెప్పినప్పటికీ వారి మాట వినకుండా నేరుగా తమ సమస్యను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు చెబుతామని రోడ్డుపై బైటాయించి ఉప ముఖ్యమంత్రి కారు ను అడ్డుకొని కారును ఆపారు. కారును ఆపి నడుచుకుంటూ వెళ్లి కాలనీలోని రోడ్లను పరిశీలించిన భట్టి విక్రమార్క కాలనీ ప్రజల సమస్యలను విన్నారు.
తమ కాలనీకి సరైన రోడ్డు వసతి లేదని వర్షాకాలం రోజుల్లో పలు ఇబ్బందులకు గురవుతున్నామని తమ కాలనీలో సీసీ రోడ్లు నిర్మించాలని, కాలనీ ప్రజలకు త్రాగేందుకు సరియైన తాగునుంటి సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నామని బట్టి కి విన్నవించారు. సమస్యలు విన్న బట్టి కాలనీ ప్రజల సమస్యలను తీరుస్తామని హామీ ఇచ్చారని కాలనీ ప్రజలు పేర్కొన్నారు. తరువాత వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పాల్గొన్నారు.
అభివృద్ధి పనులతో గ్రామీణ ప్రాంతాల్లో రహదారి సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు, ఎస్సీ కాలనీల్లో అంతర్గత రహదారుల నిర్మాణానికి ఊతం లభించనుంది. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించే లక్ష్యంతో ఈ పనులను చేపడుతున్నారు. అనంతరం మండలంలోని జమలాపురంలో వాసిరెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహించే కాంగ్రెస్ మండల పార్టీ సమావేశానికి హాజరైనారు.
ఈ కార్యక్రమాలలో మధిర ఏఎంసీ చైర్మన్ బండారు నరసింహారావు, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు బొగ్గుల శ్రీనివాస్ రెడ్డి, సర్పంచులు నండ్రు అశ్విని, కాపు వరప్రసాదరావు, కాకర్లమూడి అనిల్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఐలూరి వెంకటేశ్వర రెడ్డి, చావా రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, సీనియర్ నాయకులు కృష్ణారావు ,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు వేజెండ్ల సాయి కుమార్, క్లస్టర్ ఇంచార్జిలు, జిల్లా అధికారులు, అనధికారులు, మధిర సీఐ మధు, ఎస్సై రమేష్ కుమార్ పోలీస్ సిబ్బంది, విద్యుత్ సిబ్బంది, కాంగ్రెస్ శ్రేణులు ప్రజలు పాల్గొన్నారు.