17 April, 2026 | 2:43 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

భూ సమస్యల పరిష్కారం కోసం భూభారతి చట్టం

05-06-2025 01:15 AM

కల్లూరు, జూన్ 4(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతి చట్టం రైతుల, భూమి యజమానుల సమస్యలను పరిష్కరించేందుకు.మొదటి రోజున బత్తులపల్లి 154, ముచ్చారం 149 నుండి దరఖాస్తులు స్వీకరించగా, ఆ దరఖాస్తులను  ఆన్లైన్ చేస్తున్నట్లు తాసిల్దార్ పులి సాంబశివుడు తెలిపారు.

బుధవారం కల్లూరు మున్సిపాలిటీ పరిధిలో రైతు వేదిక నందు ఏర్పాటు చేసిన కార్యక్రం లో పులి సాంబ శివుడు అధ్యక్షతన ఏర్పాటు చేసిన రెవిన్యూ సదస్సు లో ఏం సి చైర్మన్ నీరజ ప్రభాకర్ చౌదరి  పాల్గొన్నారు.ఈ సందర్భంగా నీరజ ప్రభాకర్ చౌదరి మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులలో రైతులు వద్ద నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరిస్తారని తెలిపారు. నదస్సులు అనంతరం ఆన్ లైన్ లో పొందుపరుస్తున్నట్లు పేర్కొన్నారు.

2020 అక్టోబర్ ముందు సాదా బై నామలో దరఖాస్తులు చేసుకున్న వాటిని పరిశీలిస్తున్నట్లు,ఈ సమస్యలు సాధనకు రెవెన్యూ సదస్సులు అనంతరం పరిష్కార మార్గాలు చూపిస్తామని పేర్కొన్నారు.రైతుల సమస్యలు ఏవైనా ఉన్నట్లయితే వెంటనే నేరుగా రెవెన్యూ కార్యాలయంలో సంప్రదించవచ్చనిఆమె తెలిపారు. కల్లూరు రెవెన్యూ పరిధి నుండి అధిక సంఖ్యలో రైతులు పాల్గొని దరఖాస్తులు సమర్పించారు.ఈ కార్యక్రమంలో రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.