calender_icon.png 7 June, 2025 | 3:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

షార్ట్ సర్క్యూట్‌తో ఫర్నిచర్ షోరూం దగ్ధం

05-06-2025 01:14:17 AM

నిజామాబాద్ జూన్ 4 (విజయక్రాంతి): నిజామాబాద్ నగరంలో ని వెంకటేశ్వర్ బైపాస్ రోడ్ లో గల ప్రముఖ ఫర్నిచర్ షాప్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. బైపాస్ రోడ్ లో గల రాయల్ ఫర్నిచర్ షోరూం మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.

మంటల తీవ్రత ఉధృతం అవుతుండడంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మూడు గంటలు కష్టపడి మంటలను అదుపులోకి తెచ్చారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం సంభవించినట్లుగా ప్రాథమికంగా గుర్తించినట్టు స్టేషన్ ఫైర్ ఆఫీసర్ శంకర్ తెలిపారు. ఫర్నిచర్ ఏ మేరకు దగ్ధమైందనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. జిల్లా ఫైర్ స్టేషన్ అధికారి పరమేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం రూపాయల కోటి రూపాయలకు పైగానే ఆస్తి నష్టం జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేశారు.