9 August, 2026 | 1:04 PM

వినియోగదారులకు బిల్లుల సందేశాలు

20-06-2024 01:55 AM
  • నెలాఖరులోగా రెవెన్యూ లక్ష్యాలను చేరుకోవాలి 

సమీక్షలో జలమండలి ఎండీ సుదర్శన్‌రెడ్డి

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 19(విజయక్రాంతి): జలమండలి వినియోగదారులకు బిల్లుల చెల్లింపుల కోసం సందేశాలు(మెసేజ్‌లు) పంపాలని, రెవెన్యూపై నిర్దేశించిన లక్ష్యాలను జూన్ నెలాఖరులోగా చేరుకోవాలని జలమండలి ఎండీ సి.సుదర్శన్‌రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో బుధవారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. డివిజన్ల పరంగా రెవెన్యూ వసూళ్ల వివరాలను తెలుసుకున్నారు. మొండిబకాయిలు, కమర్షియల్ వినియోగదారుల బకాయిలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

ఇప్పటిదాకా ఉన్న పెండింగ్ బిల్స్‌పై ఆరా తీశారు. బిల్లులు చెల్లించని వారికి మెసేజ్‌లు పంపించాలన్నారు. బిల్లులు కలెక్షన్ చేసేలా మీటర్ రీడర్లను ప్రోత్సహించాలని సూచించారు. సమీక్షలో రెవెన్యూ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్‌కుమార్, ఆపరేషన్ డైరెక్టర్  1 అజ్మీరా కృష్ణ, ఆపరేషన్ డైరెక్టర్  స్వామి, అన్ని సర్కిళ్ల సీజీఎంలు, జీఎంలు, డీజీఎంలు పాల్గొన్నారు.