9 August, 2026 | 11:46 AM

సమష్టి కృషితో ఎన్నికలు విజయవంతం

20-06-2024 01:59 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 19(విజయక్రాంతి): సమిష్టి కృషితో లోక్‌సభ ఎన్ని కలు విజయవంతంగా నిర్వహించగలిగామ ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం బంజారాహిల్స్‌లోని ఐసీసీసీలో జరిగిన రివార్డ్ ఫంక్షన్‌కు అడిషనల్ సీపీ లా అండ్ ఆర్డర్, జాయింట్ సీపీ, డీసీపీలతో కలిసి ఆయన పాల్గొన్నారు. శాంతియుతంగా ఎన్నికలు జరగడానికి సహకరించిన సిబ్బందిని అభినందిచారు. ఎలక్షన్‌సెల్, పోస్టల్ బ్యాలెట్ వింగ్, సిటీ ఆర్మ్‌డ్ రిజర్వ్, ఐటీ, కమ్యూనికేషన్స్, ఆర్మ్స్ సెక్షన్, మెయిన్ కంట్రోల్ రూమ్, ఐటీ సెల్, ఐసీసీసీ బిల్డింగ్ సిబ్బంది, ఎల్ అండ్ ఓ వింగ్‌లకు చెందిన వివిధ ర్యాంకుల పోలీస్ సిబ్బందిని సత్కరించారు.