బీజేపీ పట్టణ అధ్యక్షుడిగా ఆకుల సంతోష్ కుమార్
ఆసిఫాబాద్(విజయ క్రాంతి): బీజేపీ ఆసిఫాబాద్ పట్టణ అధ్యక్షుడిగా ఆకుల సంతోష్ కుమార్(Akula Santosh Kumar) నియమితులయ్యారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, కోర్ కమిటీ నిర్ణయం మేరకు ఆయనను నియమించినట్లు నాయకులు తెలిపారు. గురువారం నూతన పట్టణ అధ్యక్షుడిని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, సీనియర్ నాయకుడు అరిగెల నాగేశ్వర్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి అరిగెల మల్లికార్జున్ యాదవ్ సంతోష్ కుమార్ను శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంతోష్ కుమార్ గతంలో ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్లో వివిధ బాధ్యతలు నిర్వహించిన అనుభవం ఉందన్నారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఆసిఫాబాద్ పట్టణంలో బీజేపీ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.సంతోష్ కుమార్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన నాయకులకు, రాష్ట్ర, జిల్లా కమిటీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ సెక్రటరీ నవీన్ గౌడ్, రైతు సంఘం ఉపాధ్యక్షుడు గొల్లయ్య, కుందారపు బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.