బిజెపి ఎంపీలు రాజీనామా చేయాలి: ఎమ్మెల్యే పాయం
03-02-2025 06:52 PM
మణుగూరు (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రం పట్ల ప్రజల అభివృద్ధి పట్ల బిజెపి వహిస్తున్న మొండి వైఖరికి నిరసనగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సోమవారం మణుగూరు టిడిపి సెంటర్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెలంగాణ ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ కేటాయించడంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు చేసిన వినతులను పట్టించుకోకపోవడం దారుణం అన్నారు. రాష్ట్రంలో బిజెపి ఎంపీలు బడ్జెట్ కేటాయింపుల్లో అన్యాయం జరిగిన నోరు విప్పకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు పాల్గొన్నారు.






