1 April, 2026 | 9:29 PM

పంచాయతీ కార్యాలయంలో పార్టీ కార్యక్రమాలపై బీజేపీ ఆగ్రహం

01-04-2026 07:57 PM

భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూరు గ్రామ పంచాయితీ కార్యాలయంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంపై బీజేపీ మండల అధ్యక్షుడు ఉప్పరి రమేష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. “ఇది గ్రామ పంచాయతీ కార్యాలయమా? లేక పార్టీ కార్యాలయమా?” అని ప్రశ్నించారు. జిల్లా స్థాయి కార్యక్రమాలు పార్టీ కార్యాలయం లేదా ప్రైవేట్ ప్రదేశాల్లో నిర్వహించాల్సి ఉండగా, పంచాయితీ కార్యాలయంలో నిర్వహించడం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న సర్పంచ్, వార్డు సభ్యులు ఇలాంటి చర్యలను ప్రోత్సహించడం తగదని విమర్శించారు. ఈ ఘటనపై వెంటనే వివరణ ఇవ్వాలని, లేదంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.