9 April, 2026 | 8:10 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

'మహా' అసెంబ్లీ ఎన్నికలు: బీజేపీ మూడో జాబితా విడుదల

28-10-2024 04:29 PM

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు 25 మంది అభ్యర్థులతో కూడిన మూడో జాబితాను భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సోమవారం విడుదల చేసింది. మూడో జాబితా ప్రకటనతో ఇప్పటి వరకు మొత్తం 146 మంది అభ్యర్థులను కమలదళం ప్రకటించింది. ఇందులో మొదటి జాబితా నుండి 99 మంది అభ్యర్థులు, రెండవ జాబితా నుండి 22 మంది అభ్యర్థులు ఉన్నారు. నాందేడ్ ఎంపీ స్థానం ఉప ఎన్నికలకు సంతుక్ మారోత్ రావ్ హంబర్డే పేరు ఖరారు చేసింది. మహాయుతి కూటమిలో సీట్ల పంపకాల ఏర్పాటులో భాగంగా మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాల్లో 151 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తోంది. మహారాష్ట్రలో నవంబర్ 20న ఎన్నికల నిర్వహించనుండగా, 23న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.