పైసా వృథా కాకుండా సీతారామ పూర్తి
- చివరి ఆయకట్టు వరకు నీరందిస్తాం
- కేసీఆర్ పాలనలో ధన దోపిడీ
- రీ డిజైన్ల పేరిట వేల కోట్ల లూటీ
- గోదావరి జలాలపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక: డిప్యూటీ సీఎం భట్టి
- ప్రాణహితకు మళ్లీ ప్రాణం
- నిపుణుల సూచనలతో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల పునరుద్ధరణ: మంత్రి ఉత్తమ్
- డిజైన్ల మార్పుల పేరుతో కాలయాపన చేయం: మంత్రి పొంగులేటి
- భద్రాద్రి జిల్లాలో సీతారామ ప్రాజెక్టు సందర్శన
ఖమ్మం/భద్రాద్రి కొత్తగూడెం/సత్తుపల్లి/అశ్వాపురం, జూలై 16 (విజయ క్రాంతి): ‘కేసీఆర్ హయాంలో గత పదేళ్లపాటు రాష్ట్రంలో ప్రాజెక్టుల పేరుతో ధన దోపిడీ జరిగింది. వేల కోట్లు లూటీ చేశా రు. కాళేశ్వరం, కూలేశ్వరమైంది. సీతారామ ప్రాజెక్టు రీ డిజైన్ పేరుతో భారీ దోపిడీ జరిగింది’ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు.
గురువా రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం సీతమ్మసాగర్ బరాజ్, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలించి, సమీక్ష సమావేశం నిర్వహించారు.
ప్రాజెక్టు వ్యూ పాయింట్ నుంచి నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం నీటిపారుదల శాఖ అధికారులు మ్యాప్‌లు, సాంకేతిక నమూనాల ద్వారా బ్యారేజ్, పంప్‌హౌస్‌లు, కాలు వలు, విద్యుత్ అనుసంధానం, పంపింగ్ వ్య వస్థ, ఆయకట్టు, ఇప్పటివరకు పూర్తయిన ప నులు, మిగిలిన పనులు, అవసరమైన నిధు లు తదితర అంశాలను మంత్రులకు వివరించారు.
సమక్ష సమావేశంతో పాటు అనంత రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ హయాంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల రీడిజైన్ల పేరిట దోపిడీకి పాల్పడ్డారని మండిపడ్డారు. ‘గతంలో వైఎస్‌ఆర్ సీఎంగా ఉన్న సమయంలో రుద్రంకోట వద్ద ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ ప్రాజెక్టుల ద్వారా 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అప్పటికే 60 శాతం పనులు పూర్తయ్యాయి.
ఈపీసీ విధానం ద్వారా మిగిలిన రూ. 1,500 కోట్లు ఖర్చు పెట్టి ఉంటే ఈపాటికే ఆ భూములకు నీళ్లు పారేవి‘ అని గుర్తుచేశారు. కానీ, గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం కేవలం అంచనాలను పెంచి దోపిడీ చేయడానికే ఆ ప్రాజెక్టులను ‘సీతారామ ప్రాజెక్టు’గా రీడిజైన్ చేసి, సీతమ్మ సాగర్ బ్యారేజీతో కలుపుకొని అంచనా వ్యయాన్ని ఏకంగా రూ.24 వేల కోట్లకు పెంచిందని ఆరోపించారు. పదే ళ్ల కాలంలో రూ.7,500 కోట్లకు పైగా ప్రజాధనాన్ని వృథా చేస్తూ దోపిడీకి తెరలేపారు’ అని ఆరోపించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్దుతూ, సీతారామ ప్రాజెక్టును సాధ్యమైనంత అర్థవంతంగా మరింత అర్థవం తంగా ముందుకు తీసుకెళ్తున్నట్లు వివరించా రు. ‘ రాజీవ్ కెనాల్ లింక్ కోసం రూ. 100 కోట్లు మంజూరు చేసి ఎన్‌ఎస్పీ కెనాల్, వైరా రిజర్వాయర్లకు అనుసంధానిస్తున్నారు. పాలేరు రిజర్వాయర్‌కు వెళ్లే జూలూరుపాడు టన్నెల్ పనులను వేగవంతం చేసి, మున్నేరు నదిని లింక్ చేయడం ద్వారా పాలేరు, వైరా, లంకా సాగర్ రిజర్వాయర్లను నింపనున్నామని చెప్పారు.
దీనివల్ల సత్తుపల్లి, పరిసర ప్రాంతాల రైతులకు త్వరగా సాగు నీరందిస్తాం’ అని వివరించారు. ఈ ప్రాజెక్టు పను ల కోసం ఇప్పటికే రూ.వెయ్యి కోట్ల బిల్లులను విడుదల చేసిందన్నారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ (టన్నెల్) పనులను త్వరితగతిన పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గోదావరి నదిలో ప్రవహిస్తున్న నీటిని గ్రావిటీ, లిఫ్ట్ ద్వారా గరిష్టంగా వినియోగంలోకి తీసుకురావాలనే ఆలోచనతో ప్రజా ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించి ముందుకు వెళుతుందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
అంతర్జాతీయంగా వస్తున్న వాతావరణ మార్పులు, వి పత్కర పరిస్థితులను తట్టుకునేలా ముందే ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుని, రాష్ట్ర ప్రభు త్వం ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోందన్నారు. మూడు రోజుల క్రితం దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ వద్ద సమ్మక్క బారేజ్ బ్యాక్ వాటర్ నుంచి నీటిని పూర్తి స్థాయిలో లిఫ్ట్ చేయడం కోసం అన్ని పంపులను ఆన్ చేయడమే కాకుండా, అక్కడ ఉన్న దాదాపు 12 జిల్లాల్లో, 17 నియోజకవర్గాలు, 22 రిజర్వాయర్లను నింపే కార్యక్రమానికి స్వయంగా అక్కడే ఉండి రివ్యూ నిర్వహించినట్టు తెలిపా రు.
తెలంగాణ ప్రాంతంలో గోదావరి నదిపై ఉన్న ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు నీరందించాలనేది ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమం లో ఎమ్మెల్యేలు మట్టా రాగమయి, మాలో తు రాందాసు నాయక్, పాయం వెంకటేశ్వర్లు, అదినారాయణ, కోరం కనకయ్య, గి డ్డంగుల శాఖ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, సుడా చైర్మన్ పువ్వాళ్ళా దుర్గాప్రసాద్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ దివాకర్, పోలీస్ కమీషనర్ సునిల్ దత్ హాజరైయ్యారు.
కాలయాపన చేయం: మంత్రి పొంగులేటి
సీతారామ ఎత్తిపోతల పథకం పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. డిజైన్ల మార్పుల పేరుతో కాలయాపన చేసే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. ఈ కరువు కాలంలో కూడా ఏన్కూర్ లింక్ కెనాల్ ద్వారా 1.20 లక్షల ఎకరాలకు సాగునీరు విడుదల చేసి రైతులకు అండగా నిలిచామని ఆయన వివరిం చారు. రైతుల సంక్షేమమే ప్రజాప్రభుత్వ ధ్యేయమన్నారు. సమీక్షలో సీతారామ భూసేకరణ పనుల కోసం వెంటనే 135 కోట్ల రూపాయలను విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన బిల్లులు సిద్ధం చేసి వెంటనే టోకెన్లు పంపాలని కలెక్టర్లను ఆదేశించారు.
ప్రాణహితకు మళ్లీ ప్రాణం: మంత్రి ఉత్తమ్
తెలంగాణ రైతాంగ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సాగునీటి రంగంలో చారిత్రాత్మక నిర్ణయాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సీతారామ ఎత్తిపోతల పథకం, సీతమ్మసాగర్ ప్రాజెక్టు, దేవాదుల ఎత్తిపోతల పథకాలను ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేసి రైతుల కలలను సాకారం చేస్తామని ఆయన ప్రకటించారు.
దివంగత మాజీ సీఎం వైఎస్‌ఆర్ ప్రారంభించిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ప్రాణహితచేవెళ్ల సు జల స్రవంతి ప్రాజెక్టును మళ్లీ పట్టాలెక్కించేందుకు తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని మంత్రి తెలిపారు. సీతమ్మసాగర్ ప్రాజెక్టుకు గత ప్రభుత్వం అవసరమైన పర్యావరణ అనుమతులు లేకుండానే పనులు ప్రారంభించడంతో న్యాయపరమైన సమస్యలు తలెత్తాయని మంత్రి గుర్తు చేశారు.
ప్రస్తుతం సుప్రీంకోర్టులో ప్రభుత్వం సమర్థంగా పోరాడుతోందని, అవసరమైన అన్ని కేంద్ర అనుమతులు సాధించి చట్టబద్ధంగా పనులు పూర్తి చేస్తామని చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రతి సాగుభూమికి గోదావరి జలాలు అందిస్తామన్నారు. భూసేకరణ, పర్యావరణ అనుమతులు, సాంకేతిక అంశాలన్నింటినీ వేగంగా పరిష్కరించి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ జాతీయ డ్యామ్ భద్రతా సంస్థ సూచనల మేరకు అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో కొనసాగుతోందని మంత్రి తెలిపారు. అన్ని పరీక్షలు పూర్తయి భద్రతా ధ్రువీకరణ లభించిన తర్వాతే బ్యారేజీలను తిరిగి వినియోగంలోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు.






