నల్ల నర్సింహులు శతజయంతి వేడుకలను గ్రామ గ్రామాన నిర్వహించాలి

16-09-2026 | 05:30pm

జనగామ,(విజయక్రాంతి): నల్ల నర్సింహులు 100వ జయంతి వేడుకలను(Black Narasimha Centenary Celebrations) గ్రామ గ్రామాన వైభవంగా నిర్వహించాలని మన ఆలోచన సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కడకం నర్సింహులు పిలుపునిచ్చారు. బుధవారం జనగామ(Jangaon)లోని మార్కండేయ ఫంక్షన్ హాల్ లో జరిగిన ఉమ్మడి జిల్లా కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అక్టోబర్ 2న జిల్లా కేంద్రంలో జరిగే శత జయంతి వేడుకలను పార్టీలకతీతంగా విజయవంతం చేయాలన్నారు. ప్రతి గ్రామంలో నల్ల నర్సింహులు విగ్రహ ఏర్పాటుకు కృషి చేయాలన్నారు.

మరిన్ని వార్తలు