29 June, 2026 | 10:12 AM

ఓటర్ల జాబితా సవరణలో బీఎల్ఎలు కీలకం

29-06-2026 08:58 AM

బూత్ లెవెల్ సూపర్వైజర్లకు దిశానిర్దేశం చేసిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు

మంథని, (విజయక్రాంతి): మంథని నియోజకవర్గ పరిధిలోని ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ల బి ఎల్ ఏ లు  సూపర్వైజర్లతో మంథని నియోజకవర్గంలోని కాటారం మండలం ధన్వాడ లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు(TPCC State General Secretary Duddilla Srinu Babu) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ప్రాథమికమని, ఈ ప్రక్రియలో బిఎల్ఎలు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

మంథని నియోజకవర్గంలోని ఈ క్రింది మండలాల పరిధిలో క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి, ఓటర్ల నమోదు ప్రక్రియను పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు. మంథని, కమాన్ పూర్, రామగిరి, ముత్తారం, పాలకుర్తి మండలాలలోని నాయకులకు కార్యకర్తలకు SIR ప్రక్రియలో భాగంగా ప్రతి బూత్ పరిధిలో బూత్ లెవెల్ ఏజెంట్లు చురుకుగా పాల్గొనాలని శ్రీను బాబు స్పష్టం చేశారు.

 అర్హులైన వారికే అవకాశం 

అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చూడటం, తప్పులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం బి ఎల్ ఏల బాధ్యత అని గుర్తు చేశారు.

ప్రజలతో అనుసంధానం 

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సూపర్వైజర్లు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ, ఓటర్ల నమోదులో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, బిఎల్ఏ లు, సూపర్వైజర్లు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.