15 April, 2026 | 12:34 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో దామాషా పద్ధతిలోనే టికెట్లు

11-06-2025 11:28 PM

కాంగ్రెస్ మహేశ్వరం నియోజకవర్గం ఇన్ చార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి..

సరూర్ నగర్ లో మహేశ్వరం నియోజకవర్గం.. బ్లాక్ కాంగ్రెస్-2 సమావేశం..

ఎల్బీనగర్: పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులు, వచ్చే ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులో కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి సామాజిక న్యాయం పాటించేందుకు కసరత్తు చేస్తున్నారని, దామాషా పద్ధతిలో ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్లు ఇస్తారని కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గం ఇన్ చార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి(constituency in-charge Kichannagari Lakshma Reddy) అన్నారు. బుధవారం సరూర్ నగర్ లోని ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో బ్లాక్ కాంగ్రెస్-2(ఆర్కేపురం, సరూర్ నగర్ డివిజన్లు, బడంగ్ పేట, మీర్ పేట్ కార్పొరేషన్లు) సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి కిచ్చెన్నగారి మాట్లాడుతూ... కులగణన ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రిజర్వేషన్లు, సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు. మీ నాయకుడిని మీరే ఎన్నుకోండి అనే రాహుల్ గాంధీ గారి సిద్ధాంతంతో... రాష్ట్ర నాయకులను అబ్జర్వర్స్ గా పెట్టి గ్రామస్థాయికి పంపుతున్నారని కేఎల్ఆర్ చెప్పారు. అబ్జర్వర్స్ శివసేనారెడ్డి, థారసింగ్ మాట్లాడుతూ... పార్టీలో కష్టపడి పని చేసే నాయకులకు తప్పకుండా గుర్తింపు ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో సరూర్ నగర్ డివిజన్ అధ్యక్షులుగా బోయిని శంకర్ యాదవ్, ఆర్కేపురం డివిజన్ అధ్యక్షులుగా పున్నా గణేష్ నేతను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.