17 April, 2026 | 3:17 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

పోలీస్ అధికారులు తమ సేవలకు గుర్తింపుగా రివార్డులు అందజేత

11-06-2025 11:32 PM

ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ..

ఏటూరునాగారం (విజయక్రాంతి): పోలీసు శాఖ అధికారులు తమ వీధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందిస్తూ కృషి చేసిన అధికారులకు గుర్తింపుగా ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్(District SP Dr. Shabarish) ఆదేశాల మేరకు బుధవారం ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ(ASP Shivam Upadhyaya) చేతుల మీదుగా ఏటూరునాగారం డివిజన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులకు రివార్డులు అందించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ శివం ఉపాధ్యాయ మాట్లాడుతూ... తమ విధుల్లో అత్యుత్తమ సేవలందించిన పోలీసు అధికారులకు గుర్తింపుగా పోలీస్ శాఖ రివార్డులు ప్రదానం చేసిందన్నారు.

పోలీసు శాఖ, అధికారుల కృషి చేసిన అధికారులకు ప్రోత్సాహకంగా రివార్డులు అందించడం జరుగుతుందని పోలీస్ అధికారులు ఉత్తమ సేవలు అందించి ప్రజలకు రక్షణ కల్పిస్తూ  తమ విధి నిర్వహణలో ఉత్తమ అధికారులుగా ముందుకు సాగాలన్నారు. సమాజంలో పోలీసులంటే ప్రజలు గౌరవించే విధంగా అంకితభావంతో విధులు నిర్వహించాలని అన్నారు. ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ప్రజలలో అధికారుల వద్ద ప్రత్యేక గుర్తింపు ఎప్పుడు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ అనుముల శ్రీనివాస్, వెంకటాపూర్ సిఐ బండారి కుమార్. ఏటూరునాగారం మంగపేట వాజేడు కన్నాయిగూడెం. ఎస్సై లు రాజ్ కుమార్ టీవిఆర్ సూరి. తాజుద్దీన్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.