22 May, 2026 | 10:27 PM

Breaking News

మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు   •   ప్రభాకర్ ఆశయ సాధనకు కృషి చేయాలి   •   సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు ఏర్పాటు చేయాలి   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   పేకాట స్థావరంపై దాడి   •   వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు, రిమాండ్   •   మద్యం సేవించి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నకిలీ విలేకరులు   •   చందుర్తి మండలంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ సమ్మేళనం   •   శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి   •  

విశ్వహింద్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

10-11-2024 02:56 PM

చేగుంట (విజయక్రాంతి): మెదక్ జిల్లా చేగుంట పట్టణ కేంద్రంలో హుతాత్మా దివస్ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో కే జీ ఎస్ హాస్పిటల్ లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమనికి పరిసర ప్రాంతాల నుండి యువత పెద్ద ఎత్తున కదిలి నా దేశం, నా ధర్మం, నా రక్తం, అనే నినాదంతో రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి, పుట్టి మల్లేశం మెదక్ విభాగ్ సంఘటన మంత్రి పబ్బ సత్యనారాయణ, జిల్లా అధ్యక్షులు నీల శ్యాంజి, జిల్లా కార్యదర్శి రామానుజపురం ప్రభాకర్, జిల్లా సహకార దర్శి భువనగిరి నాగరాజు, జిల్లా బజరంగ్ దళ్ దూడ రవీందర్, జిల్లా సప్తయిక ప్రముఖ సంయోజక్ సోమ సురేష్, ప్రఖండ అధ్యక్షులు దుర్గం నవీన్ గౌడ్, ప్రఖండ బజరంగ్ దళ్ సంయోజక్ దాసరపు ఆంజనేయులు, చేగుంట ప్రఖండ వి హెచ్ పి కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.