16 March, 2026 | 3:47 PM

అదుపుతప్పిన BMW డివైడర్‌కు ఢీ — ఎయిర్‌బ్యాగ్‌లు లేకుంటే పెను ప్రమాదమే!

16-03-2026 11:23 AM

హైదరాబాద్: ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్(Film Nagar Police Station) పరిధిలో తృటిలో భారీ ప్రమాదం తప్పింది. అతివేగంతో దూసుకొచ్చి అదుపు తప్పిన బీఎండబ్ల్యూ కారు రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. వాహనం డివైడర్‌ను బలంగా ఢీకొనడంతో కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. కారు ముందు టైరు ఊడిపోయి కారు పక్కన పడింది. ఢీకొన్న వెంటనే ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకోవడంతో ఒక పెను ప్రమాదం తప్పింది. వాహనంలోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.