16 July, 2026 | 10:06 PM

ఇజ్రాయెల్ ప్రధాని ఇంటిపై బాంబుల దాడి

17-11-2024 10:42 AM

సిజేరియా,(విజయక్రాంతి): ఉత్తర ఇజ్రాయెల్ లో బాంబుల దాడి కలకలం రేపుతోంది. ఇజ్రాయెల్ సిజేరియా పట్టణంలోని  ప్రధాని నెతన్యాహు ఇంటిపై బాంబుల దాడి జరిగినట్లు తెలుస్తోంది. నెతన్యాహు ఇంట్లోని గార్డెన్ లో రెండు ప్లాష్ బాంబులతో దాడి చేయడంతో మంటలు చెల్లరేగినట్లు అధికారులు గుర్తించారు. ఈ దాడి సమయంలో నెతన్యాహు, ఆయన కుటుంబ సభ్యలు అక్కడే లేకపోవడంతో ఎలాంటి నష్ట్రం జరగనట్లు అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ఆదివారం ఎక్స్ లో పోస్ట్‌ చేశారు.  ఇజ్రాయెల్, గాజా మధ్య కొంతకాలంగా యుద్దం కొనసాగుతున్న విషయం తేలిసిందే.