108 వాహనాల తనిఖీ
16-07-2026 05:55 PM
బిజినేపల్లి: జీవీకే గ్రీన్ హెల్త్ సర్వీస్ రాష్ట్ర క్వాలిటీ కంట్రోల్ ఆడిటింగ్ అధికారులు గురువారం మండల కేంద్రంలోని 108 వాహనాలను ప్రత్యేకంగా తనిఖీ చేశారు. జీవీకే గ్రీన్ హెల్త్ సర్వీస్ రాష్ట్ర క్వాలిటీ కంట్రోల్ ఆడిటింగ్ అధికారి వెంకటేశ్వర్లు అంబులెన్సులోని ప్రథమ చికిత్స పరికరాలు, వాటి నిర్వహణ, మందుల లభ్యత, రోగులకు అందించే ఆక్సిజన్ నిలువలను పరిశీలించారు. అంతేకాక నెలసరి కేసుల సగటుపై ఆరా తీశారు. సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ క్షతగ్రాతులను గోల్డెన్ అవరులో ఆస్పత్రులకు చేర్చాలని సూచించారు. ఈ తనిఖీల్లో జిల్లా మేనేజర్ శ్రీను, 108 సిబ్బంది శివశంకర్, జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.






