భిక్కనూర్ ఎస్‌ఐగా అనిల్ బాధ్యతలు స్వీకరణ
16-07-2026 05:59 PM
భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ పోలీస్ స్టేషన్ నూతన ఎస్‌ఐగా అనిల్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు ఇక్కడ విధులు నిర్వహించిన ఎస్‌ఐ ఆంజనేయులు రాజంపేటకు బదిలీ కాగా, మాచారెడ్డి నుంచి అనిల్ భిక్కనూర్‌కు బదిలీపై వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీఐతో పాటు ఇతర అధికారులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ అనిల్ మాట్లాడుతూ... భిక్కనూర్‌లో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు. నూతన ఎస్‌ఐకి పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు.






