4 March, 2026 | 7:09 PM

చిన్నలింగాపూర్‌లో అభివృద్ధి పనులు

04-03-2026 05:24 PM

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం చిన్నలింగాపూర్ గ్రామంలోని 6వ వార్డులో తాగునీటి సమస్య పరిష్కారానికి మాజీ ఎంపిటిసి బైరినేని రాము చర్యలు తీసుకున్నారు. 2022-23 సంవత్సరానికి సంబంధించిన ఎంపిటిసి నిధులలో రూ.1,60,000 వ్యయంతో ఏర్పాటు చేసిన బోర్ మోటార్‌ను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాభివృద్ధి తన ప్రాధాన్యమని, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తానని తెలిపారు. బోర్ మోటార్ ప్రారంభంతో ఆ ప్రాంత ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తగ్గనున్నాయని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ జక్కుల రవి, వార్డు సభ్యులు అయిలాపురం చిరంజీవి, ఏలయ్య, బాలమల్లు, రాజశేఖర్, మురళి మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.