13 April, 2026 | 4:30 PM

Breaking News

పంట పొలాల్లో అక్రమ వెంచర్లు తొలగించాలని ఫిర్యాదు   •   మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాలని డిమాండ్   •   ఆర్టీసీ బస్సులలో ప్రయాణం సురక్షితం, సుఖమయం   •   ముంబైలో ఆశా భోంస్లే అంతిమయాత్ర... అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రముఖులు   •   కాంగ్రెస్ కుంభకోణాల ప్రభుత్వం— సీతక్క చెప్పుతో కొడ్తా అనడం ఏంటి?   •   ఆధైర్యపడవద్దు అండగా ఉంటాం: ఎమ్మెల్యే   •   బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడుకి సన్మానం   •   జిల్లెల్ల గ్రామంలో ఘనంగా రోడ్డు భద్రత మహోత్సవం   •   రేవంత్‌రెడ్డికి అవగాహన లేదు— డీలిమిటేషన్‌పై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు   •   బస్వాపూర్ గ్రామంలో రోడ్డు భద్రతపై అవగాహన గ్రామసభ విజయవంతం   •  

మంథని పట్టణ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భక్తులకు అల్పాహారం ఏర్పాటు

16-02-2026 12:00 AM

మంథని, ఫిబ్రవరి 15(విజయ క్రాంతి) మహాశివరాత్రి పురస్కరించుకొని మంథని బస్ డిపో సమీపంలో పవిత్ర గోదావరి నదికి వెళ్లే భక్తుల కోసం రాష్ట్ర ఐటీ శాఖ మం త్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆశీస్సులతో మంథ ని పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు 10వ వార్డు కౌన్సిలర్ పెంటరి రాజు, యూత్ నా యకులు పెరుగు తేజ, మారుతి గౌడ్ అధ్వర్యంలో భక్తులకు అల్పాహారం ఏర్పాటు చే శారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండ ల అధ్యక్షులు ఆయిలి ప్రసాద్, 5, 11వ వార్డు కౌన్సిలర్స్ ముస్కుల సయేందర్ రెడ్డి, ఓడ్నా ల శ్రీనివాస్, జిల్లా ఆర్టీఏ మెంబర్ మంథని సురేష్, జిల్లా మీడియా ఇంచార్జీ అరెల్లి కిరణ్ మాట్లాడుతూ..

మంథని నియోజకవర్గ ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. పట్టణ యూత్ అధ్యక్షులు పెంటరి  రాజు బృందం గత మూడు సంవత్సరాల నుండి అల్పాహార వితరణ చేయడం జరుగుతుందని, ఈ సందర్భంగా వారిని అభినం దించారు. ఆ పరమశివుని ఆశీస్సు లు ఈ ప్రాంత ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని అందరు సుఖసంతోషాలతో పాడి పం టలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాల ని ఆ భగవంతున్ని కోరారు. మంత్రి శ్రీధర్ బాబు మంథని ప్రాంతాన్ని అభివృద్ధి తీసుకురావడానికి వారు ఎంతో కృషి చేస్తున్నా రని వారికి ఆ పరమశివుని ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని కోరారు.

ఈ ప్రాంత అ భివృద్ధిని చూసి మున్సిపల్ ఎన్నికల్లో 13 సీట్లగాను 11 మంది సభ్యులను గెలిపించి ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాతకు బహుమతి ఇవ్వడం జరిగిందని, రానున్న ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల్లో కూడా ఇదేవిధంగా ప్రజలు వారందరిని ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమం లో కౌన్సిలర్లు, పట్టణ యూ త్ కాంగ్రెస్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.