30 July, 2026 | 1:33 PM

కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత

30-07-2026 12:56 PM

నిర్మల్ జులై 35 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు గేట్లను గురువారం అధికారులు ఎత్తివేశారు. కడెం నదీ పరిహక ప్రాంతంలో భారీ వర్షాలు కురవడంతో పెద్ద ఎత్తున కడెం ప్రాజెక్టులోకి(Kadem Project gates lifted) వరద నీరు వచ్చే చేరుతుంది. మొత్తం ప్రాజెక్ట్ నీటిమట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 694 అడుగుల సామర్ధ్యాన్ని నిలువ ఉంచుతూ గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 90 వేల క్యూసెక్కులు రావడంతో మధ్యాహ్నం ఒంటిగంటకు ఎనిమిది గేట్లను ఎత్తి 47 వేల క్యూసెక్కుల గోదావరిలోకి వదులుతున్నారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కడెం ప్రాజెక్టు నిండిపోవడంతో ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు కింద నిర్మల్ అదిలాబాద్ జిల్లాలోని 68 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది.