6 June, 2026 | 2:51 PM

నల్ల కండవులతో కౌన్సిల్ సమావేశానికి హాజరైన బీఆర్ఎస్ కార్పొరేటర్లు

06-06-2026 01:41 PM

కమిషనర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు. 

భద్రాద్రి కొత్తగూడెం, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల పనితీరుకు వ్యతిరేకంగా శనివారం నల్ల కండవులతో మున్సిపల్ కార్పొరేషన్ సాధారణ కౌన్సిల్ సమావేశానికి బిఆర్ఎస్ కార్పొరేటర్లు హాజరై నిరసన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు పట్టించుకోని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డౌన్ డౌన్ అనే నినాదంతో కౌన్సిల్ కి హాజరయ్యారు. ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామ్ సహాయం రఘురాం రెడ్డి అధ్యక్షతన కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ సాధారణ సమావేశం నిర్వహించారు. ఏ సమావేశానికి బిఆర్ఎస్ కార్పొరేటర్లు అధికారుల పనితీరును ఎండగట్టారు.