6 June, 2026 | 2:38 PM

నాయకులను వెంటాడుతున్న లిఫ్ట్

06-06-2026 01:09 PM

కరీంనగర్, జూన్06(విజయక్రాంతి):  కరీంనగర్ లో నాయకులను లిఫ్ట్ ప్రమాదాలు(Lift accidents haunting leaders) వెంటాడుతున్నాయి. ఇటీవల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఒక ఆసుపత్రి లిఫ్ట్ నుండి కిందికి దిగుతుండగా వైర్ తెగిపోయి కిందపడి పొగ మంత్రి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. శనివారం ఎమ్మెల్యే కవ్వంపల్లి, మాజీ ఎమ్మెల్యే అరెపల్లిలు లిఫ్ట్ ప్రమాదం నుండి బయటపడ్డారు. శనివారం మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు త్రుటిలో ప్రమాదం తప్పింది. జ్యోతినగర్ లోని కెమిస్ట్రీ భవన్ రెండో అంతస్తు నుంచి లిఫ్ట్ లో కిందికి వస్తుండగా ఒక్కసారిగా లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్ లో అగకుండా ఒక్కసారిగా పడిపోవడంతో కలకలం రేగింది. లిఫ్ట్ లో ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్యే అరెపల్లి మోహన్, న్యూస్ కవరేజ్ కి వచ్చిన మహేందర్ తో పాటు మరో ఆరుగురు ఉన్నారు. ఎవరికీ గాయాలుకాలేదు. అయితే కేపసిటి కంటే ఎక్కువ మంది లిఫ్ట్ లో ఎక్కడంతో ఈ ప్రమాదం జరిగింది.