28 July, 2026 | 2:31 PM

ఎరువుల కొరతపై బీఆర్‌ఎస్ ఆందోళన ,హెచ్చరిక

28-07-2026 02:01 PM

అశ్వాపురం,(విజయక్రాంతి): రైతులకు యూరియా, డీఏపీ 20:20 ఎరువులను సకాలంలో అందుబాటులోకి తీసుకురావాలని బీఆర్‌ఎస్‌ పార్టీ డిమాండ్ చేసింది. మంగళవారం అశ్వాపురం మండల బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో మండల అధ్యక్షుడు కోడి అమరేందర్‌ యాదవ్‌ మాట్లాడుతూ, రైతులకు యాప్‌ ద్వారా యూరియా పంపిణీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం ఆచరణ సాధ్యం కాదని విమర్శించారు. ప్రభుత్వ కేంద్రాల్లో యూరియా, డీఏపీ అందుబాటులో లేక రైతులు ప్రైవేట్ దుకాణాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, అక్కడ కూడా అదనపు ఉత్పత్తులు కొనుగోలు చేస్తేనే ఎరువులు ఇస్తున్నారని ఆరోపించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఎరువుల కొరతను నివారించి, ప్రైవేట్ దుకాణాలపై తనిఖీలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే వ్యవసాయ కార్యాలయాల ఎదుట ధర్నాలు, రాస్తారోకోలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మర్రి మల్లారెడ్డి, మాజీ ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి, జాలే రామకృష్ణరెడ్డి, కందుల కృష్ణార్జునరావు, మాజీ వైస్‌ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం, సూదిరెడ్డి గోపిరెడ్డి, నియోజకవర్గ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు వెన్న అశోక్‌కుమార్‌, మండల యువజన అధ్యక్షుడు గద్దాల రామకృష్ణ, నెల్లిపాక సర్పంచ్‌ మండ్రు రామకృష్ణ, కళ్యాణపురం ఉపసర్పంచ్‌ చల్లా రాజేష్‌, గొర్రెముచ్చ వెంకటరమణ, నజీర్‌ సోను, శెట్టిపల్లి శేఖర్‌, మురికిపూడి అశోక్‌, పవన్‌ తదితర నాయకులు పాల్గొన్నారు.