28 July, 2026 | 1:41 PM

Breaking News

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన కేటీఆర్   •   మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం   •   తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తుంది   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి   •   నూతనంగా నిర్మించిన ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులను కేటాయించండి   •   విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి.. సెట్ విచారణకు సుప్రీం ఆదేశం   •   లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా   •   పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న 'మా' అసోసియేషన్   •   భాగ్యనగర్ తండా సబ్‌స్టేషన్ సమస్య పరిష్కరించాలి   •   విజయ క్రాంతి ఎఫెక్ట్... రైతు వేదిక పరిశుభ్రం   •  

మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం

28-07-2026 01:08 PM

నకిరేకల్,(విజయక్రాంతి): నకిరేకల్ మున్సిపాలిటీ..15,16, 18,19, 20 వార్డుల మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలను ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంపంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ... నకిరేకల్ పట్టణంలోని వివిధ వార్డుల్లో మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. పట్టణ అభివృద్ధిలో భాగంగా రూ.21 కోట్లతో డ్రెయినేజీ, సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు. నకిరేకల్ పట్టణానికి 800 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయించినట్లు వెల్లడించారు.గత ప్రభుత్వంలో పంపిణీ చేసిన బతుకమ్మ చీరలు నాణ్యత లేక ప్రజలకు ఉపయోగపడలేదని విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరా మహిళా శక్తి చీరలు, ఇందిరమ్మ ఇండ్ల వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. నకిరేకల్ పట్టణంలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. అలాగే పట్టణానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరైనట్లు పేర్కొన్నారు.రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రజల ఆశీస్సులు, సహకారం ఎల్లప్పుడూ ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు, అధికారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.