24 June, 2026 | 2:30 PM

Breaking News

'అలావా-ఎ-బీబీ', 'అజాఖానా జహ్రా', 'అలావా-ఎ-సర్తౌక్'లను సందర్శించిన 9వ నిజాం నవాబ్   •   తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు: సీఎంకు హరీశ్ రావు లేఖ   •   అయిజ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గుంతలు.. పేషెంట్లకు ప్రాణ సంకటం   •   నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం వైఫల్యం   •   ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు   •   ప్రజల సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందన   •   నేతివానిపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ట విరాళం   •   హరిత హారం చెట్లు నరికినందుకు జరిమానా   •   కాంగ్రెస్ ముందుగా హామీల అమలుపై సమాధానం చెప్పాలి: యలమద్ది రవి   •  

జిల్లా పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించిన దిండిగాల

27-04-2026 08:43 PM

కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్టీ కార్యాలయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు బిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యులు మాజీ గ్రంథాలయల సంస్థ చైర్మన్  శ్రీదిండిగాల రాజేందర్ ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ భవన్ లో పార్టీ జెండా ఎగరేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రజలు ఒకటే కోరుకుంటున్నారు రేవంత్ పోవాలి కేసీఆర్ రావాలి, 10 సంవత్సరాల ఎట్లుండే తెలంగాణ, కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండున్నర సంవత్సరాల తెలంగాణ ఎట్లా అయింది. కెసిఆర్ ను వాడకోట్టుకొని బాగా బాధపడుతున్నారు  మనం చేసిన 14 సంవత్సరాల ఉద్యమన్నీ స్ఫూర్తిగా తీసుకొని మళ్ళీ ఉద్యమం లా అందరూ కలిసి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని దింపి మళ్ళీ కెసిఆర్ ని కూర్చోబెడితే తప్ప ఇప్పుడు ప్రభుత్వం తో మనకి ఎటువంటి ప్రయోజనం చేయకూడదని కొనియాడారు .