నేతివానిపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ట విరాళం
మల్దకల్ జూన్ 24 : జోగులాంబ గద్వాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి బాసు హనుమంతు నాయుడు విరాళం.తన వంతు సహాయంగా గ్రామానికి వెళ్లి గ్రామ సర్పంచుకు,కమిటీ సభ్యులకు నగదు అందజేత.ఈరోజు గద్వాల నియోజకవర్గం మల్దకల్ మండలం నేతివోనిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించనున్న శ్రీశ్రీశ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్ట నిర్మాణానికి 50,000/- రూపాయలను నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి బాసు హనుమంతు నాయుడు విరాళం ప్రకటించి,తనే స్వయంగా పార్టీ నాయకులతో కలిసి,గ్రామానికి వెళ్లి,గ్రామ సర్పంచుకు,ఆలయ కమిటీ సభ్యులకు నగదును అందజేశారు. అంతక ముందు,శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి,స్వామి వారి ఆశీస్సులను పొందారు..
ఈ సందర్భంగా బాసు హనుమంతు నాయుడు కి గ్రామ సర్పంచు,ఆలయ కమిటీ సభ్యులు,నాయకులు,గ్రామస్తులు శాలువతో ఘనంగా సత్కరించి,ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచు పద్మ వెంకటేష్ నాయక్,జనార్దన్,మాజీ సర్పంచు హనుమంతు,రాజారెడ్డి,శేఖర్ నాయుడు,తిరుమలేష్, చక్రధర్ రెడ్డి,వెంకటేష్ నాయుడు,జాంపల్లి భరత్ సింహారెడ్డి,జయ రాములు,నాగేందర్,చిన్న,రజినీ బాబు,పెద్ద ఈరన్న,నరసింహులు, తిమ్మప్ప,అశోక్,పరమేష్,మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.....






