ఫిర్జాదిగూడలో ఘనంగా బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ముఖ్యఅతిథిగా పాల్గొని జెండా ఆవిష్కరించిన మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి
మేడిపల్లి,(విజయక్రాంతి): బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పీర్జాదిగూడ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రధాన కార్యదర్శి ఏడవల్లి రఘువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో పీర్జాదిగూడ, మేడిపల్లి డివిజన్‌ల నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులతో కలిసి పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి హాజరయ్యారు. ముందుగా తెలంగాణ తల్లి,అమరవీరుల స్టూపాల చిత్రపటాలకు పుష్పాంజలి గటించి నివాళులు అర్పించిన ఆనంతరం జెండా ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా జక్క వెంకట్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన అపారమైన త్యాగాలు, పోరాట స్పూర్తి, బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలు, ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన పథకాలు, అభివృద్ధి దిశగా పార్టీ తీసుకున్న నిర్ణయాలను వివరించారు. అలాగే, కార్యకర్తలే పార్టీకి బలమని, ప్రతి కార్యకర్త ప్రజల మధ్య ఉండి పార్టీ ఆలోచనలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రజల ఆశయాలను నెరవేర్చే దిశగా ముందుకు సాగుతుందని తెలిపారు.






