బోడుప్పల్ లో కొనసాగుతున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక
వారంలో ఒకరోజు డ్రైడే గా పాటించాలి డిప్యూటీ కమిషనర్ శైలజ
మేడిపల్లి,(విజయక్రాంతి): ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా 53 వ రోజు బోడుప్పల్ సర్కిల్ పరిధి ఫిర్జాదిగూడ లోని రామకృష్ణ నగర్, బోడుప్పల్ లోని ఇందిరానగర్ కాలనీల యందు మాస్సివ్ వెక్టార్ కంట్రోల్ యాక్టివిటీస్ ని విజయవంతంగా నిర్వహించినట్లు బోడుప్పల్ సర్కిల్ ఏఎంఓహెచ్ డాక్టర్ చైతన్య కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బోడుప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శైలజ హాజరై పట్టణ ప్రజలందరూ రానున్న వర్షాకాలం ని దృష్టి అందించుకొని ఇంటి పరిసరాలలో నీటి నిల్వలు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వారంలో ఒకరోజు డ్రైడే గా పాటించాలని కోరారు. దోమల నివారణ చర్యల్లో భాగంగా పట్టణ పరిధిలోని చెరువులలో గుర్రపు డెక్క తొలగించడం, ఆయిల్ బాల్స్ వేయడం, దోమల లార్వా నివారణ మందులను పిచికారి చేయడం, కాలనీలలో ఫాగింగ్ చేయడం వంటి కార్యక్రమాలు నిరంతరం జరుగుతాయన్నారు.






