బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు అరెస్ట్.. విడుదల
- తాతా మధు, నవీన్‌రెడ్డిలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు
- స్పీకర్ ఓఎస్‌డీ ఫిర్యాదుతో చర్యలు
- వారి నివాసాల్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు
- రిమాండ్‌ను తిరస్కరించి, ఇద్దరికీ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి)/ముషీరాబాద్: స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్(Speaker Gaddam Prasad Kumar)ను ఉద్దేశించి అనుచిత వ్యా ఖ్యలు చేశారన్న ఆరోపణలతో స్పీకర్ ఓఎస్‌డి ఫిర్యాదుతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు(Tata Madhu), నవీన్‌రెడ్డి(Naveen Reddy)లపై సైఫాబాద్ పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. వారిని మంగళవారం ఉదయం వారి వారి నివాసాల్లో అరెస్టు చేసి, రిమాండ్ కోసం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఇద్దరికీ బయిల్ మంజూరు చేయడం తో స్టేషన్ నుంచి విడుదల చేశారు.
ఎమ్మెల్సీ తాతా మధును న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో పోలీసులు మంగళవారం తెల్లవారుజాము న అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఎమ్మె ల్సీ నవీన్‌కుమార్‌రెడ్డిని కోకపేట్‌లోని నివాసంలో అరెస్ట్ చేశారు. వారికి కింగ్ కోఠి ఆసు పత్రిలో వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. ఎమ్మెల్సీల తరఫున న్యాయవాది ఉమామహేశ్వరరావు వాదిస్తూ పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో వాస్తవాలు లేవని, సంఘటన గేట్ నంబ ర్-3 వద్ద జరిగిందని తెలిపారు.
స్పీకర్‌ను నేరుగా దూషించలేదని, సభకు వెళ్తున్న ప్ర జాప్రతినిధులను పోలీసులు అడ్డుకున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశంపై హై కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కూడా సమర్పించారు. పోలీసుల తరఫున పీపీ వాదిస్తూ స్పీకర్‌ను అవమానించేలా వ్యాఖ్య లు చేశారని, తాత మధు చేసిన వ్యాఖ్యలు క్షమించరానివని పేర్కొంటూ రిమాండ్ వి ధించాలని కోరారు. అయితే తాత మధు.. స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై తనకు అపారమైన గౌరవం ఉందని, తన వ్యాఖ్యలను కావాలనే వక్రీకరించారని తెలిపారు.
దీంతో తాత మధు, నవీన్‌రెడ్డి.. స్పీకర్‌ను ఉద్దేశపూర్వకంగా దూషించినట్లు ఆధారాలు లేవని కోర్టు పేర్కొంటూ రిమాండ్‌ను తిరస్కరించింది. ఒక్కొక్కరు రూ.10 వేల చొప్పున పూచీకత్తు సమర్పించి విడుదల కావచ్చని కోర్టు స్పష్టం చేయడంతో ఎమ్మెల్సీలకు పెద్ద ఉపశమనం లభించింది. కాగా అసెంబ్లీ ముట్టడి, విధుల్లో ఉన్న పోలీసులను నెట్టివేయడం, బెదిరింపులకు పాల్పడ్డారన్న సీఐ బాలస్వామి ఫిర్యా దు ఆధారంగా కేటీఆర్, హరీశ్‌రావు సహా 14 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వారిని కూ డా మంగళవారం పోలీసులు అరెస్టు చేసి పలు స్టేషన్లకు తరలించారు. విడుదల అనంతరం తిరిగి అసెంబ్లీకి వెళ్లారు.
అరెస్టులకు భయపడం: తాతా మధు
తనను, నవీన్‌రెడ్డిని జైలుకు పంపించాలనే సీఎం రేవంత్‌రెడ్డి కుట్రతోనే సోమవా రం నుంచి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారని ఎమ్మెల్సీ తాత మధు ఆరోపించారు. కో ర్టులో బెయిల్ లభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అంతిమంగా న్యాయం గెలుస్తుందని కోర్టు చెప్పిందని తెలిపారు. అక్రమ కేసును బనాయించి కనీసం స్నానాలు చేయనివ్వకుండా వందలాది మం ది పోలీసులు దాడి చేసి తమను అరెస్ట్ చేశారన్నారు. అరెస్టులకు భయపడేది లేదని నొక్కి చెప్పారు.
కోర్టులో ఎస్సై అత్యుత్సాహం
నాంపల్లి కోర్టు వద్ద మీడియా ప్రతినిధులను వెళ్లిపోవాలని నారాయణగూడ ఎస్సై ఆదేశించడంతో వారు ఆందోళనకు దిగారు. వారికి న్యాయవాదులు మద్దతుగా నిలిచారు. దీంతో న్యాయవాదులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.