నాగిరెడ్డిపేట్ మండలంలో ఉగాది పండుగ సందర్భంగా ఎడ్ల బండ్ల జాతర
నాగిరెడ్డిపేట్,మార్చి 19 (విజయ క్రాంతి): ఉగాది పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని మండలంలోని గోపాల్పేట్లో నల్ల పోచమ్మ ఆలయం వద్ద ఎడ్లబండి ప్రదర్శన కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టారు. మండల కేంద్రం చుట్టుపక్కల గ్రామాలైనటువంటి చినూర్, వాడి, మాల్తుమ్మెద, పోచారం, వదలపర్తి, బంజారా తండా, గోలిలింగాల, నాగిరెడ్డిపేట, గోపాల్పేట్, లింగంపల్లి, గ్రామాల నుండి పెద్ద ఎత్తున తండోపతండాలుగా ఎడ్ల బండ్లు 38 తరలివచ్చి నల్ల పోచమ్మ ఆలయం ఐదుసార్లు ప్రదర్శించాయి.
నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని నల్ల పోచమ్మ ఆలయం వద్ద మూడు రోజులపాటు జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది.మండల ప్రజలే కాకుండా చుట్టుపక్కల మండలాల నుండి, దూర ప్రాంతాల నుండి ప్రజలు భక్తులు ప్రత్యేక వాహనాలపై తరలివచ్చి వారం రోజులపాటు జాతరను తిలకించి ప్రత్యేక వంటకాలు చేసుకొని జాతరను తిలకించి ప్రత్యేక పూజలు మొక్కులు చెల్లించుకుంటారు.
జాతరలో పెద్దపెద్ద దుకాణాలు ఏర్పాటు చేస్తారు. గోపాల్పేట్ నల్లపోచమ్మ జాతర ఒక ఏడుపాయల జాతర మాదిరిగా జరుగుతుంది.నాగి రెడ్డిపేట,ఎల్లారెడ్డి,లింగంపేట్, మండల పోలీస్ బందోబస్తు పెద్ద ఎత్తున నిర్వహించారు. అలాగే మాసంపల్లి గ్రామంలో కూడా జాతర మూడు రోజులపాటు ఘనంగా గ్రామస్తులు జరుపుకుంటారు. మొదటిరోజు ఎడ్ల బండి ప్రదర్శన, బోనాల ఉత్సవం,కుస్తీల పోటీలు నిర్వహిస్తారు. మాసానిపల్లి గ్రామానికి పెద్ద ఎత్తున భక్తులు ప్రజలు తరలివచ్చి నల్ల పోచమ్మ జాతరను తిలకిస్తారు.




