26 April, 2026 | 6:59 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

ముగిసిన తొలి రోజు ఆట.. చివరి బంతికి ఉస్మాన్ ఖవాజా ఔట్

03-01-2025 01:57 PM

బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా(India vs Australia) మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరుగుతోంది. సిడ్నీ వేదికగా చివరి టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. చివరి బంతికి ఉస్మాన్ ఖవాజా(2) ఔట్ అయ్యాడు. జస్ప్రీత్ బుమ్రా వేసిన బంతిని ఆడబోయి స్లిప్ లో దొరికిపోయాడు. దీంతో మొదటి రోజు ఆటను ఆసీస్ మూడు ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 9 పరుగులు చేసింది. మరోవైపు క్రీజులో కొన్ స్టాస్(07) ఉన్నాడు. మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 185 పరుగులకు ఆలౌట్ అయింది. టీమ్ ఇండియా ఇన్నింగ్స్ లో రిషబ్ పంత్(Rishabh Pant) (40) పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆసీస్ బౌలర్లు స్కాట్ బోలాండ్ 4, స్టార్క్ 3, కమిన్స్ 2, లైయన్ ఒక వికెట్ తీసుకున్నాడు.