24 June, 2026 | 6:35 PM

డ్రగ్స్ రహిత నిజామాబాదు మన అందరి బాధ్యత: సీపీ వెల్లడి

24-06-2026 05:30 PM
  1. - జూన్ 22 నుంచి 26 వరకు జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు
  2. - యువత సన్మార్గంలో నడిచినప్పుడే దేశ భవిష్యత్తు బాగుంటుంది
  3.  -  సే నో టు డ్రగ్స్ , సే ఎస్ టు లైఫ్ అని పిలుపునిచ్చారు
  4. - యాంటీ డ్రగ్ సోల్జర్ ' సెల్ఫీ పాయింట్ ప్రారంభం

బోధన్, జూన్24(విజయ క్రాంతి): బోధన్  పట్టణంలోని ఇందుర్ మాడల్  హై స్కూల్ లో బుధవారం మధ్యాహ్నం నిర్వహిస్తున్న మాదకద్రవ్యాల నిర్మూలన అవగాహన జూన్ 22 నుండి జూన్ 26 వరకు నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా , జూన్ 26న నిర్వహించనున్న అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం , అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని మాదకద్రవ్యాల నిర్మూలన సంబంధించి నేడు విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం నిజామాబాద్ పోలీస్ కమీషనర్  మాట్లాడుతూ... మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తుల జీవితాలను మాత్రమే కాకుండా కుటుంబాలు , సమాజం , దేశ భవిష్యత్తును కూడా తీవ్రంగా దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. 

డయల్ ఈగల్ ఫోర్స్ టోల్ ఫ్రీ నెంబర్ 1908కు సంప్రదించగలరు. సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.జూన్ 22 నుంచి 26 వరకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్‌ల పరిధిలో పాఠశాలలు , కళాశాలలు , గ్రామాలు , పట్టణాల్లో మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బోధన్ ఎ సి పి శ్రీ శ్రీనివాస్ , బోధన్ ఎస్ హెచ్ ఓ శ్రీ వెంకటనారాయణ , బోధన్ రూరల్ సిఐ శ్రీ విజయబాబు , బోధన్ రూరల్ ఎస్సై శ్రీ రాజశేఖర్ , విద్యా వికాస్ జూనియర్ కాలేజీ కరస్పాండెంట్ శ్రీ శ్రీనివాస్ , ట్రాస్మా చైర్మన్ శ్రీ హరికృష్ణ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.