15 March, 2026 | 5:47 PM

Breaking News

మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •   భిక్కనూర్ పీహెచ్‌సీ పరిధిలో గ్రామ సిబ్బందికి వైద్య శిబిరాలు   •   పెద్దమల్లారెడ్డి గ్రామపంచాయతీ సిబ్బందికి సన్మానం   •   డ్రగ్స్ టెస్టుకు నేను సిద్ధం   •   మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకి పాజిటివ్   •  

తండ్రిని పట్టించుకోని కొడుకు గిఫ్ట్ డీడ్ రద్దు

05-11-2024 02:00 AM

హనుమకొండ జిల్లాలో సీనియర్ సిటిజన్ యాక్టు అమలు

భీమదేవరపల్లి, నవంబర్ 4: హనుమకొండ జిల్లాలో మొట్టమొదటిసారిగా సీని యర్ సిటిజన్ యాక్టు అమలైంది. వృద్ధాప్యంలో ఉన్న తండ్రిని కొడుకు పట్టిం చుకోకపోవడంతో తండ్రి ఫిర్యాదు మేరకు కొడుక్కు ఇచ్చిన గిఫ్ట్ డీడ్‌ని తహసీల్దార్ రద్దు చేశారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముసాఫపూర్ గ్రామానికి చెందిన మద్దెల రాజకొంరయ్యకు కొడుకు రవి ఉన్నా డు. ఆరు సంవత్సరాల క్రితం రవికి తనకున్న 4.20 ఎకరాల భూమిని గిఫ్ట్ డీడ్ చేయించా డు. ఆనాటి నుంచి తండ్రిని రవి పట్టించుకోకుండా సరిగా తిండి సైతం పెట్టడం లేదు.

దీంతో రాజకొంరయ్య హసన్‌పర్తికి వెళ్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా స్థానికులు కాపాడారు. అప్పటి నుంచి హుజూరాబాద్‌లోని మిల్లులో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవలే సీనియర్ సిటిజన్ యాక్టు గురించి తెలుసుకుని భీమదేవరపల్లి తహసీల్దార్‌ను ఆశ్రయించాడు. వెంటనే తహసీల్దార్ ఆర్డీవో కు సమాచారం అందించారు. ఆర్డీవో సూచ న మేరకు సోమవారం రవికి ఇచ్చిన గిఫ్ట్ డీడ్‌ను రద్దు చేసి రాజకొంరయ్య పేరు మీద తిరిగి రిజిస్ట్రేషన్ చేయించారు.

తహసీల్దార్ ముల్కనూర్ ఎస్సైకి ఫోన్ చేసి రాజకొంరయ్యకు ఆయన కొడుకు రవి నుంచి రక్షణ కావాలని ఎస్కార్టుగా పోలీసులను పంపించారు. రవిని ఇకపై తండ్రి జోలికి వెళ్లకుండా మందలించాలని ఆదేశాలు జారీ చేశారు.