05-02-2026 12:42:38 AM
ఎల్బీనగర్‌లో క్యాన్సర్‌కు వ్యతిరేకంగా 5కే వాకథాన్
ఎల్బీనగర్, ఫిబ్రవరి 4 : ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎల్బీనగర్లోని గ్లెసిగల్స్ అవేర్ హాస్పిటల్ (ఫోర్టిస్ నెట్వర్క్ హాస్పిటల్) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ కరుణాకర్ రెడ్డి పర్యవేక్షణలో 5కే వాకథాన్ నిర్వహించారు. బుధవారం జరిగిన ర్యాలీని లింగోజిగూడ కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ... 2008 ఫిబ్రవరి 4న ప్యారిస్లో జరిగిన ప్రపంచ క్యాన్సర్ వ్యతిరేక సదస్సులో తొలిసారిగా ఈ దినోత్సవాన్ని ప్రకటించారని గుర్తుచేశారు.
క్యాన్సర్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం, వ్యాధితో కలిగే మరణాల రేటును తగ్గించడమే ఈ దినోత్సవ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంకాలజిస్ట్ డాక్టర్ బిందురెడ్డి, సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ హేమంత్ పరిగల, గ్లెనీగల్స్ అవేర్ హాస్పిటల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ కరుణాకర్ రెడ్డి, గ్లెనెగల్స్ అవేర్ హాస్పిటల్ క్లస్టర్ సీఈవో శ్రీ భరత్ కాంత్ రెడ్డి, వైద్యులు, నర్సులు, సమీప నివాసితులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.