calender_icon.png 5 February, 2026 | 12:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలింగ్ కేంద్రాలను సందర్శించిన పరిశీలకుడు

05-02-2026 12:43:42 AM

నిజామాబాద్, ఫిబ్రవరి 4(విజయక్రాంతి): భీంగల్ మున్సిపాలిటీ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సాధారణ పరిశీలకులు సీహెచ్.సత్యనారాయణ రెడ్డి బుధవారం సందర్శించారు. ఆయా పోలింగ్ స్టేషన్లలో అందుబాటులో ఉన్న సదుపాయాలు పరిశీలించారు.

ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా ప్రతి పోలింగ్ స్టేషన్ లో మౌలిక వసతులు అందుబాటులో ఉండాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్ లను, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాల్ లను సైతం పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. అంతకుముందు భీంగల్ లో ఎస్.ఎస్.టీ బృందాలు నిర్వహిస్తున్న తనిఖీల ప్రక్రియను పరిశీలించారు. అబ్జర్వర్ వెంట మున్సిపల్ కమిషనర్ గంగాధర్, సంబంధిత అధికారులు ఉన్నారు.