12 July, 2026 | 6:09 PM

Breaking News

తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు టీఆర్ఎస్ ఆవిర్భావం   •   ఖేలో ఇండియా ఖోఖో సెంటర్ ను సందర్శించిన డివైఎస్ఓ సురేష్   •   వాహనదారులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ పేపర్లు, లైసెన్సులు కలిగి ఉండాలి   •   జాడ లేని వానలు... ఎండుతున్న పంటలు..   •   కన్నెపెళ్లి పంప్ హౌస్ మోటార్లను వెంటనే ఆన్ చేయాలి   •   ఎమ్మార్పీఎస్ కరపత్రాలు ఆవిష్కరణ   •   సొంత ఇంటి కల నెరవేర్చడమే ప్రజా పాలన ప్రభుత్వ లక్ష్యం   •   పీఎఫ్ ఉన్న ప్రతి బీడీ కార్మికురాలికి ప్రభుత్వం పెన్షన్ అందజేయాలి   •   పెద్దమ్మ తల్లి బోనాల మహోత్సవంలో ప్రభుత్వ విప్ విజయరమణరావు   •   వనదుర్గమ్మకు భక్తుల తీరొక్క మొక్కులు   •  

పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై కారు బీభత్సం

01-10-2024 01:34 AM

సెంట్రల్ లైటింగ్ పోల్‌ను ఢీకొట్టిన వైనం

ముగ్గురికి తీవ్రగాయలు

కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు

రాజేంద్రనగర్, సెప్టెంబర్30: పీవీ నర్సింహారావ్ ఎక్స్‌ప్రెస్‌వేపై సోమవారం ఓ కారు బీభత్సం సృష్టించింది. వివరాలు.. సోమవా రం శంషాబాద్ నుంచి మెహిదీపట్నం వైపు వెళ్తున్న ఓ కారు అతివేగంగా వెళ్తూ  పిల్లర్ నంబర్ 285 వద్ద అదుపుతప్పి ఫ్లుఓవర్ మధ్యలో ఉన్న సెంట్రల్ లైటింగ్ పోల్‌ను ఢీకొట్టి మరోవైపు ఉన్న రోడ్డుపై బోల్తాపడింది.

ప్రమాదంలో వాహనం పూర్తిగా ధ్వంసంకాగా పోల్ కూడా విరిగిపోయింది. కారులో ఉన్న ముగ్గురికి తీవ్రగాయాలవడం తో పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించారు. కారు నడుపుతున్న వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. కారు బోల్తాపడటంతో ఎక్స్‌ప్రెస్‌వేపై శంషాబాద్ వైపు వెళ్లే వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపో యాయి. ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. రాజేంద్రనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.