12 July, 2026 | 6:36 PM

పెద్దమ్మ తల్లి బోనాల మహోత్సవంలో ప్రభుత్వ విప్ విజయరమణరావు

12-07-2026 05:34 PM

పెద్దపల్లి,(విజయక్రాంతి): పెద్దపల్లి పట్టణంలోని శ్రీశ్రీశ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో ఆదివారం నిర్వహించిన బోనాల మహోత్సవంలో ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి బోనం సమర్పించారు. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.

అనంతరం ఆలయ నిర్వాహకులు ప్రభుత్వ విప్‌కు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముదిరాజ్ సంఘం సభ్యులు, ప్రజాప్రతినిధులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.