అదుపుతప్పి చెట్టును ఢీకొన్న కారు..
ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు
వెంకటాపూర్, జూన్ 2 (విజయక్రాం తి): మండలంలోని పాలంపే ట పరిధిలోని నల్లగుంట క్రాస్ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృ తి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. పోలీసు లు తెలిపిన వివరాల ప్రకారం.. పాకాల కొత్తగూడ మండ లం కార్లాయి గ్రామానికి చెందిన పూనం వీ రస్వా మి తన స్నేహితులు బానోతు సుధీర్ సింగ్, ఈసా ల రవికుమార్ లతో కలిసి కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాలకు కారులో వెళ్తున్న క్రమంలో నల్లగుంట క్రాస్ రోడ్డు వద్దకు చేరుకోగానే కారు అతివేగంతో అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీ కొని బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో కారు లో ప్రయాణిస్తున్న ముగ్గురికీ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108 అం బులెన్స్కు సమాచారం అందించగా, క్షతగాత్రులను ములుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పూనం వీరస్వామి మృతి చెందగా, మిగిలిన ఇద్దరు చికిత్స పొందుతున్నారు. మృతుడి తమ్ముడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.






