15 May, 2026 | 3:27 AM

నాచు నీరే దిక్కు.. మూగజీవాల గోస..

15-05-2026 02:05 AM

చారకొండ, మే 14: మండలంలోని గోకారం గ్రామంలో ఎండ తీవ్రతకు పశువులు నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. గ్రామంలో ఏర్పాటు చేసిన నీటి తొట్టెలో నీరు పూర్తిగా అడుగంటి, నిలిచిన కొద్దిపాటి నీరు కూడా నాచుపట్టి కలుషితంగా మారింది. దాహంతో అలమటిస్తున్న పశువులు, దూడలు ఆ బురద నీటినే తాగడానికి ప్రయత్నిస్తున్న దైన్యస్థితి కనిపిస్తోంది.

చెరువులు ఎండిపోవడంతో ఈ తొట్టెలే పశువులకు ఆధారం కాగా, పంచాయతీ అధికారులు క్రమంగా నీటిని నింపడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు మండి పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి స్వచ్ఛమైన తాగునీటిని నింపాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.