సీఈసీ దిష్టిబొమ్మ దహనం

28-09-2026 | 07:18pm

మెట్‌పల్లి,(విజయక్రాంతి): ఏఐసీసీ పిలుపు, టీపీసీసీ ఆదేశాల మేరకు, రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు సూచనలతో మెట్‌పల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేసినట్లు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఎం.డి. రైసోద్దీన్ తెలిపారు. ఈ సందర్భంగా రైసోద్దీన్ మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా, పారదర్శకంగా పనిచేయాల్సిన రాజ్యాంగబద్ధ బాధ్యత కలిగి ఉందన్నారు. ఓటర్ల జాబితా సవరణ, ఓటర్ల పేర్ల తొలగింపు, ఎస్‌ఐఆర్‌ (SIR) వంటి అంశాల్లో పూర్తి పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని డిమాండ్ చేశారు.

ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కు రక్షణ కోసం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని తమ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ దిష్టిబొమ్మ దహనం కార్యక్రమం చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, వైస్ చైర్మన్ ఓంకార్ నవీన్, బర్ల సూరి, కౌన్సిలర్లు బత్తుల నరేష్, గుడికందుల అజయ్, మాసుల ప్రవీణ్, అజీమ్, రెబస్ మహేష్, దావనపెళ్లి రాజారాం, మైనార్టీ టౌన్ ప్రెసిడెంట్ జాకీర్, లవ్ కుమార్, జెట్టి లక్ష్మణ్, మార్గం కిరణ్, ఉల్లెందుల రమేష్, దానపల్లి గణేష్, పులిమామిడి ప్రవీణ్ కుమార్, జలాల రాజగోపాల్, బర్ల వంశీ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు