2 May, 2026 | 6:56 PM

Breaking News

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతల అవగాహన కార్యక్రమం   •   మేడ్చల్ జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షుడిగా కేకే చారి ఎన్నిక   •   ప్రజా అవసరాలను గుర్తించి పరిష్కరించేలా ప్రజా పాలన సభలు   •   గుండెపోటుతో మరణించిన హోంగార్డ్ సురేష్ భౌతిక కాయానికి నివాళులర్పించిన ఎస్పీ రోహిత్ రాజు   •   ఆర్డీవో ఆఫీసుల్లోనూ ప్రజావాణి..!   •   సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించాలి   •   నీట్ పరీక్షపై ఇన్విజిలేటర్ల ఓరియెంటేషన్ కార్యక్రమం   •   వైభవంగా స్వామివారి నిత్య కళ్యాణం   •   మెరుగైన సేవల కోసం 108 సిబ్బందికి శిక్షణ   •   వేతనాల కోసం మున్సిపాలిటీ కార్మికుల నిరవధిక సమ్మె ప్రారంభం   •  

పాకిస్థాన్ హైకమిషన్‌లో సంబురాలు?

25-04-2025 12:43 AM
  1. ఆఫీసులోకి కేక్ తీసుకెళ్తూ కనిపించిన ఓ వ్యక్తి
  2. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
  3. పాక్ అధికారుల తీరుపై మండిపడుతున్న నెటిజన్లు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 24 : న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్‌లోకి ఓ వ్యక్తి కేక్ తీసుకెళ్తున్నట్టు కనిపించిన వీడియో గురువారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో దేశంలో పాకిస్థాన్ దేశంపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న వేళ.. పాక్ హైకమిషన్‌లోకి ఓ వ్యక్తి కేక్ తీసుకెళ్లడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. కేక్ తీసుకెళ్తున్న వ్యక్తి వద్దకు మీడియా ప్రతినిధులు వెళ్లి..‘కేక్ ఎందుకు తీసుకెళ్తున్నారు? కేక్ కట్ చేసే సందర్భం ఏమిటి?’అని ప్రశ్నించారు. దానికి అతడు సమాధానమివ్వకుండా వెళ్లడం కనిపించింది. సదరు వ్యక్తి గోధుమ రంగు పఠానీ సూట్ ధరించి, గడ్డంతో ఉన్నాడు.

కాగా, పాక్ హైకమిషన్ తీరుపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతే పాక్ అధికారులు కేక్ కట్ చేసి సంబురాలు చేసుకుంటున్నారా? అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.