2 August, 2026 | 5:42 PM

కాసిపేటలో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ మెరుపుదాడి

02-08-2026 04:21 PM

ఐదుగురు అరెస్టు, రూ.1.10 లక్షలకుపైగా నగదు స్వాధీనం 

బెల్లంపల్లి, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం సోమగూడెంలో ఓ ఇంట్లో పేకాట స్థావరంపై రామగుండం పోలీస్ కమిషనరేట్ నార్కోటిక్ బృందం/టాస్క్ ఫోర్స్‌ మెరుపు దాడీ చేశారు. ఈ సంఘటనలో ఐదుగురు పట్టుబడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. కాసిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సోమగూడెం గ్రామంలోని ఆదివారం అర్దరాత్రి ఓ ఇంటిలో నగదును పందెంగా పెట్టి పేకాట నిర్వహిస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ బృందానికి విశ్వసనీయ సమాచారం అందింది. అర్దరాత్రే  పోలీసులు ఆ ఇంటిపై మెరుపుదాడి చేశారు. ఈ దాడిలో నగదు పందేలు నిర్వహిస్తూ పేకాట ఆడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల  నుంచి 52 పేక ముక్కలు, రూ.1,10,630 నగదు, ఐదు మొబైల్ ఫోన్లు, మూడు మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితులను, స్వాధీనం చేసుకున్న నగదు,వస్తువులను తదుపరి చట్టపరమైన చర్యల కోసం కాసిపేట పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు.