2 August, 2026 | 5:55 PM

ఉత్సవాల కోసం బిచ్చమెత్తుకోవాలా?.. బోనాల ఏర్పాట్లపై బండి సంజయ్ అసంతృప్తి

02-08-2026 04:46 PM

బోనాల ఏర్పాట్లపై కేంద్రమంత్రి బండి సంజయ్ అసంతృప్తి

హైదరాబాద్: కేంద్ర త్రి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Kumar) కింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి(Ujjaini Mahakali Temple) అమ్మవారిని దర్శించుకున్నారు. ఉజ్జయిని బోనాల ఏర్పాటుపై బండి సంజయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉత్సవాల నిర్వహణ కోసం బిచ్చమెత్తుకోవాలా?, రంజాన్ కు రూ. 33 కోట్లు, బోనాలకు రూ. 20 కోట్లు కేటాయింపా? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జంటనగరాల్లో 3 వేలకు పైగా ఆలయాల్లో బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయని వివరించారు. 3 వేలకు పైగా ఆలయాలకు రూ. 20 కోట్లు సరిపోతాయా? కాంగ్రెస్ కు హిందువుల పండగలంటే అంత చులకన ఎందుకు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ సైతం బోనాలకు నిధుల కేటాయింపులో నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. జనాభా ప్రాతిపదికన పండుగలు, ఉత్సవాలకు నిధులు ఇవ్వాలని బండి సంజయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి(Ujjaini Mahakali) అమ్మవారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, సీతక్కతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.