21 April, 2026 | 2:16 AM

చాడ పరామర్శ

21-04-2026 01:05 AM

చిగురుమామిడి, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): చిగురుమామిడి మండలంలోని లంబాడిపల్లె, ముల్కనూర్ గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన కాటం కిషన్ రెడ్డి, మర్రి పొచవ్వ కుటుంబాలను సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి సోమవారం పరామర్శించారు. మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ట్రాక్టర్ ప్రమాదంలో మృతి చెందిన కిషన్ రెడ్డి కుటుంబానికి ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయం అందేలా మంత్రితో మాట్లాడతానని హామీ ఇచ్చారు.

ఆయన వెంట సీపీఐ సీనియర్ నాయకులు మర్రి కొమురయ్య, లంబాడి పల్లి సర్పంచ్ కాటం సంపత్ రెడ్డి, సీపీఐ మండల కార్యదర్శి నాగేల్లి లక్ష్మారెడ్డి, జిల్లా నాయకులు అందే స్వామి, అందె చిన్న స్వామి, గడిపే మల్లేష్, గోలి బాపిరెడ్డి, గూడెం లక్ష్మి, మండల నాయకులు కయ్యం తిరుపతి, కయ్యం వీరన్న, అనువోజు జనార్ధన్, పైడిపల్లి వెంకటేష్, మర్రి రవి, శ్రీను, ఐలయ్య తదితరులున్నారు.