వినాయకుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ

15-09-2026 | 07:22pm

సంతోషాలతో ఉండాలి 

సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ 

సుల్తానాబాద్,(విజయక్రాంతి): ఆది దేవుడైన వినాయకుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని వేడుకోవడం జరిగిందని పెద్దపల్లి జిల్లా  సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ(Sultanabad Municipal Chairman Birudu Radhakrishna) అన్నారు. స్థానిక శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం(Sri Venugopalaswamy Temple) వద్ద వినాయక యూత్ క్లబ్ ఆధ్వర్యం లో గాదం వినయ్ సృజన దంపతులు  ఏర్పాటు చేసిన గణేశుడు వద్ద చైర్మన్ దంపతులు రాధాకృష్ణ సమత  ప్రత్యేక పూజలు చేశారు.

గాదం వినయ్ సృజన దంపతులు అందర్నీ ఆకట్టుకునే విధంగా అర్ధ భాగం శివయ్య మరో అర్థ భాగం గణేషు డి నీ ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని వినయ్ సృజన దంపతుల ను చైర్మన్ బిరుదు రాధాకృష్ణ సమత దంపతులు అభినందించారు.. ఈ వినాయకు డు భక్తుల ను ఎంతగానో ఆకట్టుకుంటుంది.... పూజ అనంతరం వినయ్ సృజన దంపతులు అన్నదాన కార్యక్రమం నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వినాయకుడి కృపకు పాత్రులయ్యారు...

మరిన్ని వార్తలు