మృతుల కుటుంబాలకు మంత్రి పొన్నం పరామర్శ

15-09-2026 | 07:26pm

కోహెడ,(విజయక్రాంతి): కోహెడ మండలం(Koheda Mandal)లో ఇటీవల మృతి చెందిన పలువురి బాధిత కుటుంబాలను మంగళవారం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) పరామర్శించారు. శనిగరం గ్రామం కాంగ్రెస్ పార్టీ(Congress Party) సీనియర్ నాయకులు కర్ర రాజశేఖర్ తల్లి లక్ష్మిబాయి మృతి చెందారు. కోహెడ గ్రామ శాఖ అధ్యక్షులు ముంజ తిరుపతి తల్లి ముంజ కనకవ్వ, పోరెడ్డిపల్లి లో వేమూగంటి ఈశ్వరమ్మ మృతి చెందారు. విషయం తెలుసుకున్న మంత్రి.. బాధిత కుటుంబలను సందర్శించారు. ఈ సందర్బంగా మృతుల చిత్రపటాల ఎదుట నివాళులు అర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.

మరిన్ని వార్తలు