10 May, 2026 | 12:51 PM

Breaking News

అంతిమ యాత్రలో పాడే మోసి అభిమానాన్ని చాటుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   మోడీ సభకు ప్రత్యేక రైలులో బిజెపి శ్రేణులు   •   నేను మీ అందరివాణ్ని.. మద్ధతు ఇచ్చిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు: తమిళనాడు సీఎం విజయ్   •   తమిళనాడు సీఎం విజయ్‌కి శుభాకాంక్షలు తెలిసిన సీఎం రేవంత్   •   తెలంగాణలో యథావిధిగా ఇంటర్మీడియట్ అడ్మిషన్స్   •   “మాతృ దినోత్సవం” సందర్భంగా అమ్మలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు   •   మైనర్ బాలికపై అత్యాచారం.. శ్రీలంక బౌద్ధ సన్యాసి అరెస్టు   •   తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం   •   రెండు దశాబ్దాల సేవలకు న్యాయం చేయాలి   •   శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదాలతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలి   •  

శ్రీవారికి వైభవంగా చక్రస్నానం

14-10-2024 04:05 AM

ముగిసిన సాలకట్ల బ్రహ్మోత్సవాలు

తిరుపతి, అక్టోబర్ 13: సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరిరోజైన శనివారం తిరుమలలో వైభవంగా చక్రస్నానం నిర్వహించారు. రాత్రి 7 గంటలకు నిర్వహించిన ధ్వజావరోహణంతో ఉత్సవాలు ముగిశాయి. ఉదయం భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఆలయంలో 8 రోజులుగా మలయప్పస్వామికి వివిధ వాహన సేవలు నిర్వహించారు.

అక్టోబర్ 4న ప్రారంభమైన బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారు భక్తులకు వివిధ రూపాల్లో అభయమిచ్చారు. శనివారం విజయదశమి నేపథ్యంలో ఆలయానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. భక్తుల కోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తిరుమల శ్రీవారికి ఆదివారం సాయంత్రం భాగ్‌సవారి ఉత్సవం నిర్వహించారు.

బ్రహ్మోత్సవాలు ముగిసిన మరుసటి రోజు ఈ ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. భాగ్‌సవారి ఉత్సవంలో చిన్నజీయర్‌స్వామి, టీటీడీ అడిషన్ ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి దంపతులు, ఆలయ అధికారులు, శ్రీవారి భక్తులు పాల్గొన్నారు.