సీఐ సుబ్బారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్సై చంద్రకుమార్
సుల్తానాబాద్ ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన చంద్రకుమార్
సుల్తానాబాద్,(విజయక్రాంతి): సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా చంద్రకుమార్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సీఐ సుబ్బారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్సై చంద్రకుమార్ మాట్లాడుతూ... శాంతి భద్రతల పరిరక్షణ పోలీసుల లక్ష్యమని అన్నారు.
ప్రజలు సమస్యలు ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయాలన్నారు. మహిళల పట్ల అసభ్యకరంగా వ్యవహరిస్తే కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని, ర్యాగింగ్, ఈవీ టీజింగ్ కు పాల్పడితే జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్సై చంద్రకుమార్ కు సిబ్బంది పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు.




